తెలంగాణ తల్లిని అవమానించే విధంగా కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం చేపట్టిన చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.రాష్ట్ర సచివాలయానికి తెలంగాణ అమర జ్యోతి కి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టుపెట్టే దిక్కుమాలిన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కేటీఆర్ గెలుపునిచ్చారు.తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.ఈ ఘటనను తెలంగాణ సమాజమంతా వ్యతిరేకించాలని , రేవంత్ రెడ్డి వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.లేకపోతే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
‘తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలాన్ని కేసీఆర్ 2023 జూలైలోని ఎంపిక చేశారు.యావత్ తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లిని గౌరవించుకునేందుకు కేసిఆర్ ఎంపిక చేసిన స్థలానికి ఆమోద ముద్ర వేసింది.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసింది.కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపరిచేలా ఉంది.
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం .సకల మర్యాదలతో గాంధీ భవన్ కు తరలిస్తాం ‘ అని కేటీఆర్ వ్యాఖ్యనించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని మేము ముందు నుండి చెప్పాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేస్తున్నారు .ఢిల్లీ బాసుల మెప్పుకోసం తెలంగాణ ఆత్మను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు సైస్ మనోభావాలు కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందడమే ముఖ్యమైపోయింది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.