ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi likker scam) కే వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను నిన్న ఢిల్లీలో ఈడి అధికారులు విచారించారు ఈ కేసులో ఆమెను నిన్ననే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరిగినా, 16వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావలసిందిగా ఈడీ అధికారులు ఆదేశించారు.ఇక నిన్న కవిత ను ఈడి అధికారులు విచారిస్తున్న సమయంలోనే ఢిల్లీలో బీఆర్ఎస్(Brs) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది.
కెసిఆర్, కేటీఆర్ , మంత్రి హరీష్ రావు(Harish rao), బీఆర్ఎస్ కీలక నాయకులంతా ఢిల్లీలోనే మకాం వేశారు .ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వీరంతా బిజీగా గడిపారు.

ఇక కేంద్ర అధికార పార్టీ బిజెపి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ హడావుడి చేసినా, నిన్న మధ్యాహ్నం నుంచి సీన్ మారిపోయింది.పార్టీ నేతలు ఎవరు ఈడి విచారణ పైన , కేంద్రం పైన ఎటువంటి విమర్శలు చేయవద్దని, అలాగే టీవీ చర్చ కార్యక్రమాల్లోనూ ఈ అంశాలపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ మాట్లాడవద్దు అంటూ ప్రగతి భవన్ నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లడంతో, వారంతా సైలెంట్ అయిపోయారు.ఇక మూడు రోజుల క్రితం కవితను బండి సంజయ్ విమర్శించడాన్ని తప్పుపడుతూ , నిన్న మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తూ, ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు.

కవిత లిక్కర్ స్కాంకు పాల్పడితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అంటూ సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యానించడాన్ని తప్పుపడుతూ ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలు, దహనాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలోనూ బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.ఒక్కసారిగా కేంద్రం పైన , ఈ డి విషయంలోనూ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోవడం తో రాజీ చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి.నిన్న కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగినా, అది జరగలేదు.
ఈనెల మరో మారు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈలోపు బిజెపి కేంద్ర పెద్దలతో కేసీఆర్ మంతనాలు జరిపి కవిత అరెస్టు కాకుండా, జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.







