టిడిపిలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ? వారు ఎవరంటే  ?

తెలంగాణలో ప్రధాని ప్రతిపక్షం బీఆర్ఎస్ కు( BRS ) వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

  ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ లో చేరిపోయారు.

మరి కొంతమంది బిజెపి వైపు చూస్తున్నారు.ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలనే అంశంపై హైకోర్టులోను విచారణ జరుగుతుండగా,  మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో అంతంత మాత్రంగానే అన్నట్టుగా ఉన్న టిడిపిలో( TDP ) చేరబోతుండడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి,  మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి( MLA Chamakura Malla Reddy ) సమావేశం అయ్యారు.జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిసారు.

ఆయనతో పాటు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,( MLA Marrirajasekhar Reddy )  మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తదితరులు కలిసి మాట్లాడారు.మల్లారెడ్డి మనవరాలు వివాహానికి చంద్రబాబును( Chandrababu ) ఆహ్వానించేందుకే కలిసినట్లు చెబుతున్నా,  దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా అర్థం అవుతుంది.చంద్రబాబుతో భేటీ అయిన బీఆర్ఎస్ నేతలు తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లెటర్స్ ను అనుమతించాలని చంద్రబాబును కోరారు.

Advertisement

ఈ సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు .ఈ సందర్భంగా త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.  తెలంగాణలో టిడిపికి పునర్ వైభవం తీసుకొస్తామని కృష్ణారెడ్డి వ్యాఖ్యనించారు.

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ప్రదాత చంద్రబాబు అని కృష్ణారెడ్డి ప్రశంసించారు.త్వరలోనే మల్లారెడ్డి తో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,  తీగల కృష్ణారెడ్డి చేరే అవకాశంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే తన ముఖ్య అనుచరులతో మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా టిడిపిలో చేరే అంశం పైన చర్చించినట్లు త్వరలోనే తెలంగాణ టిడిపికి కొత్త అధ్యక్షుని నియమించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న సమయంలోనే మల్లారెడ్డి టిడిపి వైపు చూస్తూ ఉండడంతో ,తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని మల్లారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది .త్వరలోనే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో సమాచారం రానుంది.

Advertisement

తాజా వార్తలు