త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.ఈ మేరకు సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ నుంచే ‘కదనభేరీ’( Kadana Bheri Public Meeting ) మోగించేందుకు సిద్ధం అయ్యారు.
సుమారు లక్ష మందితో బీఆర్ఎస్ సభను ఏర్పాటు చేస్తుంది.ఈ సభతో బలప్రదర్శనకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ జిల్లా( Karim Nagar ) కీలక పాత్ర పోషించిందన్న విషయం తెలిసిందే.

అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ను కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతగానో ఆదరించారు.2014 లో సైతం కేసీఆర్( KCR ) కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.అంతేకాదు ఉద్యమాలైనా, సంక్షేమ పథకాలు అయినా సరే ఈ జిల్లా నుంచే కేసీఆర్ ప్రారంభించేవారు.
తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు.ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.







