కారు దిగి హస్తంలోకి బిఆర్ఎస్ కౌన్సిలర్ లు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వ్యాప్తంగా కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు .

నాయకులు చేజారుతున్న ముఖ్య నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయటం లేదు.జిల్లా నాయకులు కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుడడంతో వారిలో నైరాశ్యం నెలకుంటున్న టు తెలుస్తుంది.

ఓటర్ల తీరుకు అనుగుణంగానే బీఅర్ ఎస్ నాయకులు సైతం సొంత గూటిని వీడి కండువాలు మరుస్తున్నారు.బీఅర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఅర్ ( KTR )స్వంత నియాజికవర్గంలోని సిరిసిల్ల మున్సిపాల్ బీఅర్ ఎస్ కౌన్సిలర్లు కుడిక్యాల రవి,వేముల రవి, రెడ్డి నాయక్ లు బిఅర్ఎస్ పార్టీ ని వీడి శుక్రవారం సిరిసిల్ల నియాజికవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

వీరికి కేకే మహేందర్ రెడ్డి పార్టి కండువా కప్పి పార్టిలో కి అహ్వనించారు.కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమలను చూసి , ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

Advertisement

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లొనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసిందని అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి గెలిచి,కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళ కి లక్ష రూపాయల అర్ధిక సహయం అందిస్తామని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రకటించారని అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరి న్యాయం జరుగుతుందని అన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

Latest Rajanna Sircilla News