రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ( BRS, BSP ) మధ్య పొత్తు పొడిచింది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )సమావేశం అయిన సంగతి తెలిసిందే.
భేటీ అనంతరం పొత్తుతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.కలిసి పోటీ చేస్తామన్న ఆయన త్వరలో సీట్ల పంపకాలు జరుగుతాయని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్( BJP , Congress ) తో రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తమను తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తారు.
బీఎస్పీ అధినేత్రి మాయవతితో చర్చించిన తరువాత త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు.