తండ్రిమీద పగతో ఐదేళ్ల చిన్నిరిని చంపేశాడు ఓ సైకో.కరీంనగర్ జిల్లా కాతాళం మండలం ధామరకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తండ్రి మీద కోపంతో అతని కూతురిని ఎత్తుకెళ్లి గొంతుపిసికి చంపేశాడు.అనంతరం తన ఇంట్లో గంప కింద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.
చిన్నారి కోసం వెతికిన తల్లిదండ్రులకు చివరికి మృతదేహంగా బాలిక దొరికింది.పోలీసులు ఎఫ్ఫైఆర్ నమోదు చేసి కేసు విచారణ చేస్తున్నారు.
ఇలా తండ్రుల మీద, తాత ల మీదా కోపంతో పిల్లల్ని చంపడం తెలంగాణా లో ఎక్కువ అయిపొయింది అని పోలీసులు పేర్కొంటున్నారు.ఈ విషయం మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనీ పోలీసులతో పాటు తల్లి తండ్రులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలి అనీ పిల్లలని ఒంటరిగా పంపించద్దు అనీ చేబుతున్నారు పోలీసులు.







