ఇప్పటికే దక్షిణ ధృవానికి ట్రెక్కింగ్ చేసి చరిత్ర సృష్టించారు భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ.ఇప్పుడు తాజాగా ఆమె మరో సాహసయాత్రకు సిద్ధమయ్యారు.అంటార్కిటికా మీదుగా 1,100 మైళ్ల ట్రెక్కింగ్ చేయనున్నారామె.అది కూడా ఒంటరిగా, ఎవరి సాయం లేకుండా.తన సాహసాలతో ‘‘పోలార్ ప్రీత్’’గా గుర్తింపు తెచ్చుకున్న చాందీ.ఈ ఏడాది జనవరిలో దక్షిణ ధ్రువంలో 700 మైళ్లు నడిచారు ప్రీత్ చాందీ.
అది కూడా కేవలం 40 రోజుల్లోనే ఈ యాత్రను పూర్తి చేయడం విశేషం.తాజాగా అంటార్కిటికా యాత్ర కోసం ఆమె దాదాపు 120 కిలోల లగేజీని తనతో పాటు తీసుకెళ్లనున్నారు.
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్ధితులు వుండే అంటార్కిటికాలో యాత్ర చేయడం సాహసమేనని చెప్పాలి.మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పాటు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
అంటార్కిటికాలో ప్రీత్ చాందీ 75 రోజుల పాటు జర్నీ చేయనున్నారు.తొలుత నెమ్మదిగా యాత్రను ప్రారంభించి .తర్వాత చాందీ తన వేగాన్ని పెంచుకుంటారని బ్రిటీష్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
32 ఏళ్ల హర్‌ప్రీత్ చాందీ బ్రిటీష్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.దక్షిణ ధృవాన్ని ఎవరి సాయం లేకుండా ఒంటరిగా చుట్టిరావాలని.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి మహిళగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని దానిని సాధించారు.
దక్షిణ ధృవంపైనా మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.ఇలాంటి ప్రతికూల పరిస్ధితుల్లో తన కిట్‌ను లాక్కుంటూ 700 మైళ్లు వెళ్లారు.
అంతేకాదు.దక్షిణ ధృవంలో సోలోగా యాత్రను పూర్తి చేసిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా రికార్డుల్లోకెక్కారు ప్రీత్ చాందీ.
ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ వాయువ్య ప్రాంతంలో ఉన్న మెడికల్ రెజిమెంట్‌లో సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె లండన్‌లోని క్వీన్ మేరీస్ యూనివర్సిటీలో పార్ట్‌టైమ్‌లో స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.అంటార్కిటికా భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తైన, పొడిగా, గాలులతో వుండే ఖండమని ఆమె చెప్పారు.అక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించరని.తొలుత తన ప్రణాళికను ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి పెద్దగా ఏమి తెలియదని అదే తనను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించిందని గతంలో హర్‌ప్రీత్ తెలిపారు.