బ్రిటీష్ సిక్కు ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ .( MP Preet Kaur Gill ) హౌస్ ఆఫ్ కామన్స్ సెషన్‌లో.
యూకేలోని సిక్కు కమ్యూనిటీ( UK Sikh Community ) సభ్యులను లక్ష్యంగా చేసుకుని భారతదేశంతో ప్రమేయమున్న ట్రాన్స్‌నేషనల్ అణచివేత, ఏజెంట్ల సమస్యను లేవనెత్తారు.అనేక మంది బ్రిటీష్ సిక్కులు ‘‘హిట్ లిస్ట్’’లో( Hit List ) కనిపించారని , ప్రాథమిక సంరక్షణ, ప్రజారోగ్యానికి సంబంధించిన షాడో మంత్రి ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటీష్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి భద్రతా మంత్రి టామ్ తుగేన్‌ధాట్‌ను అడిగారు.
ఈ వారం హౌస్ ఆఫ్ కామన్స్( House of Commons ) సెషన్‌లో మాట్లాడుతూ.ఎలాంటి పేర్లు ప్రస్తావించకుండా విదేశాలలో వున్న సిక్కులపై హత్యా కుట్రలను ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.
ఇటీవలి నెలల్లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో సిక్కు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భారత్‌తో లింక్ వున్న ఏజెంట్ల చర్యల గురించి ఫైవ్ ఐస్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని గిల్ సోమవారం తెలిపారు.

ఫైవ్ ఐస్( Five Eyes ) అనేది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లతో కూడిన గూఢచార కూటమిని సూచిస్తుంది.బెదిరింపులను ఎదుర్కొంటున్న బ్రిటీష్ సిక్కుల నివేదికల దృష్ట్యా, వారి భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.? అని ప్రీత్ కౌర్ గిల్ ప్రశ్నించారు.దీనికి పార్లమెంట్‌లో హోం ఆఫీస్ క్వశ్చన్ అవర్‌లో మంత్రి తుగేన్‌ధాట్( Minister Tugendhat ) సమాధానమిచ్చారు.యూకే అంతటా వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ, భద్రతకు సంబంధించిన బెదిరింపులను తన విభాగం నిరంతరం అంచనా వేస్తోందని చెప్పారు.
ఏదైనా విదేశీ శక్తి ద్వారా ఎవరైనా బ్రిటీష్ పౌరుడిపై నిర్దిష్ట బెదిరింపులు వుంటే , తాము తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇతర కమ్యూనిటీల వలే సిక్కు సమాజం కూడా సురక్షితంగా వుండాలని మంత్రి పేర్కొన్నారు.

కాగా.ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను( Hardeep Singh Nijjar ) గతేడాది జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.దీని వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం వుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.దీనికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టిగా బదులిచ్చింది.
ఈ ఆరోపణలు అసంబద్ధం, రాజకీయ ప్రేరేపితమని కౌంటరిచ్చింది.ఈ వ్యవహారం భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ఇక గతేడాది మరో ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని.ఈ విషయంలో ఓ ప్రభుత్వ అధికారితో పాటు భారతీయ వ్యక్తికి సంబంధం వుందని అమెరికా ఆరోపించింది.