ప్రపంచం ఓ కుగ్రామం అయిన తర్వాత భారతీయులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఖండాలు దాటుతున్నారు.మెరుగైన జీవితం , ఉపాధిని వెతుక్కుంటూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పరాయిగడ్డపై అడుగుపెడుతున్నారు.
అయితే వీరిలో చట్టప్రకారం విదేశాలకు వెళ్లేవారు కొందరైతే, చట్టవిరుద్ధంగా, దొడ్డిదారులలో ఆయా దేశాలకు వెళ్లేవారు మరికొందరు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump as US President) బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఇలాంటి వారిని వెతికి వెతికి పట్టుకుంటున్న ట్రంప్(Trump).విమానాలలో వారి స్వదేశాలకు తరలిస్తున్నారు.ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.ఇప్పటికే 104 మందితో కూడిన భారతీయుల బృందం అమృత్‌సర్‌లో దిగిన సంగతి తెలిసిందే.
ఈ చర్యతో ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా.అమెరికన్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.బ్రిటన్(Britain) ప్రభుత్వం కూడా ట్రంప్ బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది.అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది.ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(British Prime Minister Keir Starmer) ధ్రువీకరించారు.
తమ దేశంలో అక్రమ వలసలు పెరిగాయని.చట్ట వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తున్నారని, ఇలాంటి వాటిని ముగిస్తామని స్టార్మర్ స్పష్టం చేశారు.

అక్రమ వలసదారుల గుర్తింపు కోసం పెద్ద ఎత్తున భారతీయ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు.వీటితో పాటు జనరల్ స్టోర్స్, బార్‌లు, కార్ వాష్ ఏరియాలలో తనిఖీలు చేపట్టింది వందలాది మందిని అరెస్ట్ చేసింది.దేశవ్యాప్తంగా దాదాపు 828 చోట్ల తనిఖీలు చేపట్టి.609 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
గతేడాది కన్జర్వేటివ్‌లను ఓడించి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిహద్దు భద్రత, శరణార్దు(Security, asylum)ల అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన స్టార్మర్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 4 వేల మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది.