రొమ్ము క్యాన్సర్ … ఎప్పుడూ మహిళలు ఈ వ్యాధి బారిన పడ్డట్లు విన్నామే తప్పా, పురుషులు దీనితో బాధపడుతున్నట్లు వినడం చాలా అరుదు.కాని ఈ వ్యాధి వలన మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదం అంట.
గుణాంకాల ప్రకారం, బ్రిటన్ లో ప్రతి ఏడాది సుమారు 55 వేల మంది మహిళలు రిమ్ము క్యాన్సర్ బారిన పడుతోంటే, 350 మంది పురుషులు మాత్రమే ఈ వ్యాధి చేతికి చిక్కుతున్నారట.పురుషుల్లో ఈ వ్యాధి చాలా అరుదుగా జరిగే విషయం కాబట్టే, సరిగా గుర్తించలేకపోవడం జరుగుతోంది , తద్వారా మరణించే అవకాశం పురుషుల్లోనే ఎక్కువ కనిపిస్తోందట.
ఇలా ఎందుకు జరుగుతోంది అనేది సుస్పష్టం.రొమ్ము క్యాన్సర్ అనేది మహిళలకు మాత్రమే వస్తుందనే అపోహ చాలామందికి ఉంది.రొమ్ము క్యాన్సర్ తో హాస్పిటల్లో చేరే పురుషులంతా, క్యాన్సర్ లేట్ స్టేజిలోనే వస్తున్నారట.ఈ అవగాహన లోపంతో క్యాన్సర్ ని ముందే గుర్తించకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో, రొమ్ము క్యాన్సర్ మరణాల్లో పురుషుల సగటే ఎక్కువ అని తేలింది.
అందుకే .పురుషుల్లారా.తస్మాత్ జాగ్రత్త.రొమ్ములోంచి రక్తం కారడం, రమ్ము ఉబ్బుగా మారడం, పుండు లా ఏర్పడటం జరిగితే, ఏదో అలెర్జి కావచ్చు అని లైట్ గా తీసుకోకండి.







