నల్గొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.పంట పొలంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టేందుకు ప్రయత్నించారు.
కట్టంగూరు మండలం మునుకుంట్లలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
మునుకుంట్లలో గత కొంతకాలంగా రవీందర్, విజయ్, సుధాకర్ అనే వ్యక్తుల మధ్య భూ వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో విజయ్, సుధాకర్ లు ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా రవీందర్ అడ్డుకున్నాడు.దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ఇరువురు రవీందర్ ను ట్రాక్టర్ తో తొక్కి చంపేందుకు ప్రయత్నించారని సమాచారం.
ఈ క్రమంలో ట్రాక్టర్ ముందు భాగం పట్టుకొని రవీందర్ వేలాడుతున్న డ్రైవర్ అలానే ట్రాక్టర్ నడిపాడని తెలుస్తోంది.తప్పించుకున్న బాధితుడు రవీందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








