పడుకోవడానికి కొంతచోటు, ప్రేమగా పట్టడం అన్నం పెడితే చాలు కుక్కలు( Dogs ) జీవితాంతం మనతోటే ఉంటాయి.మనల్ని కాపాడతాయి.
దొంగలను రానివ్వకుండా అడ్డుకుంటాయి.పాములు వస్తే పసిగట్టి వెంటనే అప్రమత్తం చేస్తాయి.
అవి యజమానుల పట్ల చూపించే విశ్వాసం అసలు కొలవలేనిది.అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఒక కుక్కని పెంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
వీటిని హింసించకుండా ఇంటిలో సభ్యునిగా చూసుకోవాలి.అప్పుడే అవి కూడా బాగా పెరిగి, పూర్తిస్థాయిలో అంగరక్షకులుగా మారుతాయి.
మన ఇండియాలో కుక్కల పట్ల క్రూరంగా కొందరు ప్రవర్తించినా ఫారన్ దేశాల్లో వీటిని ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేస్తారు.ముఖ్యంగా అమెరికాలో వీధి కుక్కలను కూడా అడాప్ట్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తారు.
వాటికి మాటలు రాకపోయినా మనలాగానే ఒక మనసు ఉంటుందని, అవి కూడా బాధపడతాయని వారు బాగా అర్థం చేసుకుంటారు.తాజాగా కుక్క మనుషులకు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుందో నిరూపించే ఒక వీడియో వైరల్ గా మారింది.
ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఒక వ్యక్తి కుక్కను వాకింగ్ కి ( Walking ) తీసుకెళుతున్నట్లు మనం చూడవచ్చు.
అంతలోనే అటువైపుగా ఇద్దరు దొంగలు( Thieves ) బైక్ మీద వచ్చారు.అనంతరం బైక్‌ను కుక్క యజమాని( Dog Owner ) దగ్గర ఆపారు.ఒక దొంగ బైక్ దిగి యజమాని పొట్టపై కత్తి లేదా ఏదో మారణాయుధం పెట్టబోయాడు.
ఇది గమనించిన కుక్క గాల్లో ఎగిరి మరీ అతడి చేతి కండను కరవడానికి ట్రై చేసింది.తన ముందే తన యజమాని మీద చెయ్యేసే ధైర్యం చేస్తావా అంటూ అతడి పైకి అది వెళ్లిపోయింది.
ఆ కుక్క చాలా బలిష్టంగా ఉండటంతో దానికి చిక్కితే, చనిపోవడం ఖాయమని దొంగ గ్రహించాడు.అందుకే వెంటనే బైక్ ఎక్కి( Bike ) అక్కడి నుంచి పారిపోయాడు.కుక్క ఎక్కువగా సీన్ క్రియేట్ చేయకుండా, దాని ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా యజమాని దానికి కట్టిన తాడును గట్టిగా పట్టుకున్నాడు.మొత్తం మీద ఈ ప్రమాదం నుంచి యజమాని బయటపడ్డాడు.
అదే కుక్క అతని పక్కన లేకపోతే దొంగలు అతడి ప్రాణాలను కూడా తీసేసి ఉండేవారు.
సీసీటీవీ ఇడియట్స్ అనే ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ పేజీ దీనిని పంచుకుంది.“అందుకే కుక్కలు మనకి అసలైన స్నేహితులు” అని దీనికి ఒక క్యాప్షన్ కూడా జోడించింది.ఈ వీడియో షేర్ చేసిన కొంత సమయంలోనే రెండు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
కుక్క చేసిన వీరోచిత చర్యకు చాలామంది ఫిదా అయ్యారు.తాము కూడా ఇప్పుడే వెళ్లి ఒక కుక్కను కొనుక్కొచ్చుకుంటామని కామెంట్లు చేశారు.
దీనిని మీరు కూడా చూసేయండి.