భారతీయ, దక్షిణాసియా బిజినెస్ కమ్యూనిటీలను టార్గెట్ చేస్తూ దోపిడీ , బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువ కావడంతో కెనడాలోని బ్రాంప్టన్, సర్రేలోని మేయర్లు అప్రమత్తమయ్యారు.ఈ ముప్పును నిర్మూలించడానికి వేగవంతమైన చర్య తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్( Brampton Mayor Patrick Brown ), సర్రే మేయర్ బ్రెండా లాక్‌లు.కెనడా ప్రజా భద్రత మంత్రి డొమినిక్ లెబ్లాంక్( Minister Dominic LeBlanc )కు రాసిన లేఖలో దోపిడీ యత్నాలు, కాల్పులు సహా ఇతర హింసాత్మక చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ భయంకరమైన పరిణామం, బెదిరింపుల తీవ్రత , విస్తృత ప్రభావాన్ని నొక్కి చెబుతుందని వారు లేఖలో తెలిపారు.

పీల్స్ రీజినల్ పోలీసులతో పాటు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) , స్థానిక పోలీస్ విభాగాలు పరిస్ధితి తీవ్రతను గుర్తించాయని మేయర్లు పేర్కొన్నారు.సీపీ 24 వార్తాఛానెల్ కథనం ప్రకారం.పీల్ పోలీసులు ఇటీవలే ఎక్స్‌టార్షన్ ఇన్వెస్టిగేటివ్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించారు.
ఇది ప్రస్తుతం 16 దోపిడీ ఘటనల చుట్టూ వున్న పరిస్ధితులను పరిశీలిస్తోంది.నిందితులు బాధితుల పేర్లతో పాటు వారి ఫోన్ నెంబర్లు, చిరునామాలు, వ్యాపార సమాచారాన్ని తరచుగా తెలుసుకుంటారని పోలీసులు వెల్లడించారు.
ఆపై సోషల్ మీడియా ద్వారా వారిని సంప్రదించి డబ్బు డిమాండ్ చేస్తారని చెప్పారు.ఈ సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలని దోపిడీ బెదిరింపులను పరిష్కరించడానికి సమగ్ర వ్యూహాన్ని అమలు చేయడానికి ఫెడరల్ ఏజెన్సీలతో పాటు స్థానిక, ప్రాంతీయ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మేయర్లు ప్రభుత్వాన్ని కోరారు.

కాగా.జనవరి 3న అల్బెర్టాలోని ఎడ్మోంటన్ పోలీసులు( Edmonton Police ).ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న 18 దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.అవి వరుస కాల్పులు, డ్రైవ్ బై షూటింగ్‌లతో సంబంధం కలిగి వున్నాయని వారు విశ్వసిస్తున్నారు.
డిసెంబర్ 27, 2023 తెల్లవారుజామున బ్రిటీష్ కొలంబియాలోని హిందూ దేవాలయం అధిపతి కుమారుడి నివాసంపై 14 కాల్పులు జరిగాయి .ఈ రెండు ఘటనలతో కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ ఉలిక్కిపడింది.