Brahmanandam : సాయంత్రం 8 తర్వాత హైదరాబాద్ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు : బ్రహ్మానందం

సినీ నటుడు మరియు కమీడియన్ అయిన బ్రహ్మానందం( Brahmanandam ) కొన్ని వందల సినిమాల్లో నటించి అందరిని నవ్వించి గిన్నిస్ బుక్ లో కూడా ఓకే ఏడాది అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డు సాధించిన వ్యక్తి.

సినిమా ఇండస్ట్రీ వరకు ఆయన చేయని రోల్ లేదు నటించని కథ లేదు.

కామెడీ హీరోగా సైతం కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ గా నటించి తనకు సాధ్యం కానీ పాత్ర ఏదీ లేదని నిరూపించాడు.సినిమా ఇండస్ట్రీ కి సంబంధించినంత వరకు ఎన్నో శిఖరాలను అధిరోహించిన బ్రహ్మానందం వ్యక్తి గత జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు.

ఆయన గురించి ఇప్పటివరకు తెలియని కొన్ని సంచలన విషయాలను ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవి బ్రహ్మానందం తన అభిమానులతో పంచుకున్నారు.

బ్రహ్మానందం జీవితంలో ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా మద్యం తీసుకోలేదని విషయం మీలో ఎంత మందికి తెలుసు.కానీ అది నిజం ఆయన మద్యం జోలికి కానీ వ్యసనాల జోలికి కానీ ఇంత వరకు వెళ్లలేదు.వెళ్లాల్సిన అవసరం కూడా తనకు ఇప్పటి వరకు రాలేదని బ్రహ్మానందం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.

Advertisement

సినిమాల్లో నటించిన అవకాశాలు లేకపోయినా తాను తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా ఇలాగే చాలా సింపుల్ గా గడిపేస్తానంటూ కూడా బ్రహ్మానందం తెలియజేస్తున్నారు.ఇక సాయంత్రం 8 దాటితే హైదరాబాద్ లైఫ్( Hyderabad ) ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు.

అసలు మిడ్ నైట్ బయటకెళ్ళి పోయి నచ్చింది తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.

కానీ తనకు సినిమా సెట్ నుంచి ఇంటికి వెళ్లడం తప్ప మరొక వ్యాపకం ఉండదని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని అందువల్లే తన జీవితం ఇంత ప్రశాంతంగా గడిచిపోతుందని కూడా చెబుతున్నారు.8 తర్వాత బయట తిరిగి చేసే పనే ఉంటుందని కూడా బ్రహ్మానందం చురకలు అంటిస్తున్నారు.బ్రహ్మానందం ఖాళీగా ఉన్న సమయంలో పెయింటింగ్స్( Paintings ) వేస్తూ దేవుడు చిత్ర పటాలు గీస్తూ తన తోటి నటీనటులకు పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇస్తూ ఉంటారు.

మరి ఏ పని లేకపోతే మనవడితో కూడా ఆడుకుంటూ తన జీవితాన్ని రిటైర్మెంట్ లైఫ్ నీ ఎంజాయ్ చేస్తున్నారు బ్రహ్మానందం.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు