స్కూల్ కు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా స్కర్ట్స్ వేసుకోవచ్చు...ఎక్కడంటే

ప్రపంచం లో ఏ దేశంలో అయినా అమ్మాయిలకు ఒక డ్రస్ కోడ్,అబ్బాయిలకు ఒక డ్రస్ కోడ్ అనేది ఉంటుంది.

అది స్కూల్ అయినా,కాలేజీ అయినా మరేదైనా కానీ.

అయితే మెక్సికో లో మాత్రం ఇక పై అబ్బాయిలు కూడా స్కూల్స్ కు అమ్మాయిల లా స్కర్ట్స్ వేసుకొని వెళ్లొచ్చట.ఈ మేరకు సిటీ మేయర్ క్లాడియా షేన్ బామ్ వెల్లడించారు.

ప్రపంచం మారుతుంది,ప్రపంచం తో పాటు మనుషులు కూడా మారాలి అని కోరుతూ లింగ వివక్ష అనేది ఇకపై ఉండకూడదు అన్న వుద్దేశ్యం తో ప్రాచీన పద్ధతులకు, సంస్కరణలకు గుడ్ బై చెప్పి ఈ కొత్త ట్రెండ్ ను సృష్టించాలి అని కోరారు.దేశంలో లింగ వివక్ష అనేది ఉండకూడదు అన్న ఉద్దేశ్యం తో స్కూల్స్ కు అబ్బాయిలు కూడా కావాలంటే స్కర్ట్స్ వేసుకోవచ్చు అని ఆమె సూచించారు.

మెక్సికో నగరంలో ఉన్న స్కూళ్లకు ఇకపై అబ్బాయిలు కూడా స్కర్ట్‌లు వేసుకుని వెళ్లచ్చట.

Advertisement

అదే విధంగా అమ్మాయిలు సైతం ట్రౌజర్లు వేసుకుని స్కూలుకు రావచ్చు.లింగవివక్షను తీసివేయడానికే ఈ పద్దతిని అమలు చేస్తున్నామని మేయర్ క్లాడియా వివరించారు.ఆమె తీసుకొచ్చిన ఈ సంస్కరణకు ట్రాన్స్‌జెండర్ సంఘాలు మద్దతు పలికాయి.

విద్యాశాఖ మంత్రి ఎస్టెబన్ సైతం మేయర్ తీసుకొచ్చిన సంస్కరణను అభినందించారు.ఇతర రాష్ట్రాలు సైతం ఈ పద్దతిని అమలుచేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిజంగా అబ్బాయిలు కూడా స్కర్ట్స్ వేసుకొని స్కూల్స్ కు వెళితే ఎవరు అమ్మాయి,ఎవరు అబ్బాయి అని పోల్చుకోవడం కష్టమే అయిపోతుంది.ఇక ఈ పద్దతిని ఇంకా ఎన్ని దేశాలు ఫాలో అవుతాయో చూడాలి.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు