నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.యువ హీరోలకు పోటీగా బాలయ్య సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాకు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) గా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య గురించి బోయపాటి శ్రీను(Boyapati Sreenu) మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.బోయపాటి దర్శకత్వంలో ఇప్పటికే బాలకృష్ణ మూడు సినిమాలలో నటించగా ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే.చివరిగా ఈయన అఖండ (Akhanda) సినిమాలో బోయపాటితో కలిసి నటించారు త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఇక బోయపాటి తాజాగా స్కంద( Skanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బోయపాటి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారితో నేను కనుక సినిమా చేస్తున్నాను అంటే ఆయన కథ అసలు వినరు నేను చెబుదామని ప్రయత్నాలు చేసిన మీరున్నారు కదా బ్రదర్ మీరు చూసుకోండి అన్ని అంటూ నాకు చెప్పేస్తారు.కానీ ఆయన ఎప్పుడూ కథ మాత్రం వినరు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతనే బాలయ్య గారికి నేను సినిమా చూపిస్తానని, బాలకృష్ణ గారు కథ వినకుండా సినిమా చేస్తారు అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి బోయపాటి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.బోయపాటి ఇప్పటివరకు బాలయ్యకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వడంతో అదే నమ్మకం వల్లే సినిమా కథలు వినరని అర్థం అవుతుంది.







