ఓజి వర్సెస్ గేమ్ ఛేంజర్.. బాబాయ్ - అబ్బాయ్ మధ్య పోటీ ఉండబోతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఓజి( OG Movie ) ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎప్పుడో అంచనాలు పెరిగి పోయాయి.

ఇక వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత పెంచేస్తున్నారు మేకర్స్.ప్రకటించిన కొద్దిరోజులకే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి కూడా చేసుకుంటున్నారు.

ఇప్పటికే ముంబై, పూణేలలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా ఫాస్ట్ గా పూర్తి అవ్వడంతో ఈ ఏడాది డిసెంబర్ రెండవ వారంలోనే లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్.మరి ఇదే నిజమైతే ఈసారి పవన్ కళ్యాణ్ తన కొడుకు రామ్ చరణ్( Ram Charan ) తో పోటీ పడనున్నాడు అని టాక్ వస్తుంది.ఎందుకంటే రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్( Game Changer movie ) కూడా ఆల్మోస్ట్ అదే నెలలో మూడవ వారంలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇది నిజమైతే ఈసారి బాబాయ్ - అబ్బాయ్ మధ్య పోటీ తప్పేలా లేదు.రెండు సినిమాల నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ ఇందులో నిజమెంతో తెలియదు.అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తుండగా అంజలి, సునీల్, శ్రీకాంత్ వంటి వారు కీలక రోల్స్ లో నటిస్తున్నారు.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు