బుచ్చిబాబు(Bucchi Babu) డైరెక్షన్లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) ఇండస్ట్రీకి పరిచయమవుతూ నటించినటువంటి చిత్రం ఉప్పెన ( Uppena ) ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కృతి శెట్టి ( Kriti Shetty ) హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా వీరిద్దరూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా ఉప్పెన సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో బుచ్చిబాబు పేరు మారుమోగిపోయింది.దీంతో ఈయన మరో మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ తో తన రెండో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా నిర్మాత బోనీ కపూర్ ( Boney Kapoor ) కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా పూజా కార్యక్రమాల కంటే ముందుగానే రామ్ చరణ్ తో కలిసి డైరెక్టర్ అలాగే జాన్వీ, బోనికపూర్ అందరూ కలిసి చిట్ చాట్ చేశారు.
ఇందులో భాగంగా బోనీ కపూర్ మాట్లాడుతూ తాను ఉప్పెన సినిమా చూశానని చాలా అద్భుతంగా ఉందని తెలిపారు.అయితే ఈ సినిమాని తాను హిందీలో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నానని ఈయన వెల్లడించారు.ఖుషి కపూర్( Kushi Kapoor ) కి కూడా ఆ సినిమా చూడమని సలహా ఇచ్చాను అంటూ ఈ సందర్భంగా ఈయన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.
మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఖుషి కపూర్ రెండు బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్న సంగతి తెలిసిందే.