సీఎం జగన్ పై రాయి దాడి ఘటన ఆరోపణలపై బోండా ఉమ రియాక్షన్..!!

ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) రాయి దాడి జరగడం తెలిసిందే.జగన్ ఎడమ కనుబొమ్మపై దాడి జరిగింది.

 Bonda Uma Reaction On Allegations Of Stone Pelting On Cm Jagan Details, Tdp, Bo-TeluguStop.com

ఈ ఘటనలో కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ( Bonda Uma ) పేరు వస్తూ ఉంది.

దీంతో తనపై వస్తున్న ఆరోపణల విషయంలో బోండా ఉమ స్పందించారు.రాజకీయ ప్రయోజనాల కోసం తనని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ సంఘటన అనుకోకుండా జరిగింది.ఆ కుర్రోడు ఎందుకు దాడి చేశాడో కూడా చెప్పాడు.

తన ఇంటి పక్కన అన్నా క్యాంటీన్ తీసేసారని, డబ్బులు ఇవ్వకుండా రోడ్డుమీద వదిలేశారని.తన తల్లికి 200 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు.

ఇలా డబ్బులు ఇవ్వకుండా ఎవడికి వాడు వెళ్ళిపోయాడు అనే బాధతో.కోపంతో చీకట్లో ఒక రాయి విసిరాడు.దురదృష్టవశాత్తు అది సీఎంకు తగిలింది.అంతేతప్ప… అదేమంత పెద్ద విషయం కాదు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో( Vijayawada Central Constituency ) ఈ ఘటన జరిగింది కాబట్టి వాళ్లకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావించి నన్ను టార్గెట్ చేస్తున్నారు.అయితే ఇందులో వాస్తవాలు ఉంటాయి.

సాక్షాధారాలు ఉంటాయి.ఎలాంటి పరిస్థితుల్లో నా పేరును తీసుకువస్తూ కేసును పెట్టించారో ?.ఎవరు కేసు బుక్ చేశారో ?.ఎవరు విచారణ చేస్తున్నారో ?… వారంతా నా పేరును ప్రస్తావిస్తే మాత్రం జూన్ 4 తర్వాత కచ్చితంగా.వారంతా కేసుల్లో ఇరుక్కుంటారు అని.బోండా ఉమ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube