బోండా కూడా టాటా బైబై చెబుతున్నారా

టీడీపీ కీలక నేత బోండా ఉమా కూడా టీడీపీ పార్టీ కి టాటా బైబై చెప్పబోతున్నారా? అని అంటే నిజమే అని అనిపిస్తుంది.ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలైన బోండా ఉమా ఆ తరువాత నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఏక్టివ్ గా పాల్గొనడం లేదనే చెప్పాలి.

ఆమధ్య కాపు నేతలు అంతా సమావేశమై చర్చలు జరిపినప్పుడు హాజరైన బోండా ఉమా ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కీలక భేటీ కి హాజరు కాలేదు.దీనితో బోండా ఉమా తీరుపై ఆ పార్ట్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ లో ధీటుగా వ్యవహరించే టీడీపీ నాయకుడి కోసం అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.అయితే మరోపక్క బోండా ఉమా వైసీపీ లో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఒక ,మరో మంత్రి కలిసి బోండా తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది.

-Telugu Political News

అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ని ఏకరువు పెట్టిన నేతలలో బోండా ఉమా ఒకరు.అలాంటిది ఇప్పుడు ఆయన టీడీపీ కి గుడ్ బై పలికి వైసీపీ అడుగులు వేస్తారా అన్న సందేహం కూడా కలుగుతుంది.మరోపక్క ఆయన పార్టీ తో ఎలాంటి సంబంధాలు నెరపకపోవడం తో ఈ వార్తల్లో నిజం ఉందనే అనిపిస్తుంది.

మరి దీనిపై స్పష్టత తెలియాలి అంటే మరో కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube