పేలిన నాటు బాంబు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

నాటు బాంబులు పేలి ఇద్దరు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులోని యంపీయూపీ పాఠశాల వద్ద బాంబులు పేలడంతో సమీపంలో ఉన్న ఇద్దరు విద్యార్థులు తిరుపతిరావు (12 ), రాజు (11 ) కు తీవ్ర గాయాలు అయ్యాయి.

వీరిద్దరిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.వీరిద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఈ ఇద్దరు విద్యార్థులు ఆడుకుంటుండగా ఆ సమీపంలో ఒక సంచి లాంటి వస్తువు దొరికింది.అందులో ఏముందో చూసేందుకు రాళ్లతో పగులగొట్టే ప్రయత్నం చేశారు.

దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులు పేలాయి.ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.

Advertisement

అసలు అక్కడ ఆ బాంబులు ఎందుకు వచ్చాయి ? అక్కడ ఎందుకు పడేసారు అనే విషయంపైనా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు