రండి బాబు రండి... తెలుగు జవాన్ ను కొనుగోలు చేయండి

బాలీవుడ్‌ బాద్ షా.సూపర్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్ ( Shahrukh Khan )నటిస్తున్న జవాన్( Jawan ) సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

 Bollywood Hero Sharukh Khan Movie Jawan Telugu Rights , Bollywood, Sharukh Khan-TeluguStop.com

సెప్టెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జవాన్ సినిమా కు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం( Directed Atlee ) వహించాడు అనే విషయం తెల్సిందే.తమిళ సినీ ఇండస్ట్రీ కి చెందిన నయనతార.

విజయ్ సేతుపతి మరియు యోగి బాబు లు హిందీ జవాన్ సినిమా లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Telugu @sharukhkhan, Sharukh Khan, Jawan, Pathan, Telugu-Movie

కనుక ఈ సినిమా కు తమిళ సినీ ఇండస్ట్రీ లో మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారు ఎవరు లేకపోవడంతో ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంతే కాకుండా తెలుగు బయ్యర్స్‌ ఎవరు కూడా ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మొత్తానికి హిందీ జవాన్ సినిమాను తెలుగు లో బిజినెస్ చేసేందుకు నిర్మాతలు చాలానే కష్టపడాల్సి వస్తుంది.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన షారుఖ్ ఖాన్ యొక్క పఠాన్ సినిమా కూడా తెలుగు లో పెద్దగా వసూళ్లు సాధించింది ఏమీ లేదు.

దాంతో షారుఖ్‌ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రస్ట్‌ లేదు అని నిరూపితం అయ్యింది.

Telugu @sharukhkhan, Sharukh Khan, Jawan, Pathan, Telugu-Movie

భారీ అంచనాల నడుమ రూపొందిన జవాన్ సినిమా ను హిందీ మరియు తమిళంలో భారీగా బిజినెస్ చేస్తే చాలు.ఇతర భాషల్లో సినిమా వసూళ్ల విషయంలో పెద్దగా ఇంట్రస్ట్‌ లేదు అంటూ యూనిట్‌ సభ్యుల( Unit members ) యొక్క పద్దతి చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.జవాన్ సినిమా లో షారుఖ్ ఎలా ఉండబోతున్నాడు అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

సినిమా ఎలా ఉంటుంది అనేది కూడా స్పష్టత వచ్చింది.అయినా కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం జవాన్ విషయం లో ఇంకా ఆసక్తి చూపడం లేదు.

అలాగే బయ్యర్స్‌ కూడా పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా లేరు అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube