బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్( Salman khan ) గురించి మనందరికీ తెలిసిందే.సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కాగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సల్మాన్ ఖాన్.
ఇందులో భాగంగానే ఇటీవలే టైగర్ 3 ( Tiger 3 ) మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.యష్ రాజ్ స్పై సినిమాటిక్ యూనివర్సల్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.అదేమిటంటే.సల్మాన్ ఖాన్ తాజాగా.
జగన్ బీర్( Jaganbeer ) అనే ఒక 9 ఏళ్ల బాలుడిని కలుసుకున్నాడు.అసలు ఈ బాలుడిని సల్మాన్ ఖాన్ ఎందుకు కలిశారు అన్న విషయానికి వస్తే.
ఈ చిన్నారి క్యాన్సర్ తో( Cancer ) బాధపడుతున్నాడు.తొమ్మిది రౌండ్ల కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ ను జయించాడు జగన్ బీర్.
సల్మాన్ 2018లో మొదటిసారిగా జగన్ బీర్ ను కలువగా అప్పుడు అతని వయసు 4 సంవత్సరాలు.జగన్ బీర్ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు, ఆ సమయంలో సల్మాన్ కలిశాడు.
విషయం తెలుసుకున్న సల్మాన్ ఆ పిల్లాడికి దైర్యం చెప్పాడు.
నువ్వు క్యాన్సర్ ను జయించు.మళ్లీ నిన్ను కలుస్తాను అని మాట ఇచ్చాడు.ఇక ఈ కుర్రాడు 9 రౌడ్ల కీమో థెరపీ( Chemotherapy ) ద్వారా క్యాన్సర్ ను జయించాడు.
దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం జగన్ బీర్ ను మళ్లీ కలిశాడు.ఈ సందర్భంగా జగన్ బీర్ తల్లి మాట్లాడుతూ.మూడేళ్లవయసులో తన కొడుకు అకస్మాత్తుగా చూపును 90 శాతం మేర కోల్పాయాడు.వైద్యులు అతని నుదిటిలో ఒక నాణెం పరిమాణ క్యాన్సర్ కణితి ఉన్నట్లు నిర్దారించారు.
అది నరాల మీద ఒత్తిడిని కలిగించడం వల్ల అతనికి అకస్మాత్తుగా దృష్టి లోపానికి దారితీసింది.చికిత్స కోసం ఢిల్లీ లేదా ముంబైకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ విషయం కొడుక్కు ఎలా చెప్పాలో తెలియక సల్మాన్‌ను కలవబోతున్నారని జగన్ బీర్ కు చెప్పారు.ఇక ఆసుపత్రిలో చేరిన జగన్ బీర్ సల్మాన్ ఖాన్ ను కలవాలని ఆశించాడు.అందుకోసం ఒక వీడియోను రూపొందించగా అది సల్మాన్ ఖాన్ వద్దకు చేరింది.దీంతో సల్మాన్ జగన్‌బీర్‌ను కలవడానికి వచ్చాడు.చూపు కోల్పోయిన జగన్ బీర్ సల్మాన్ ఖాన్ తాకీ అతని ఉనికిని గమనించాడు.ఇక అప్పుడు జగన్ బీర్ వద్ద సల్మాన్ మాట తీసుకోగా ఈరోజు జగన్ బీర్ క్యాన్సర్ ను జయించాడు.
దీంతో మళ్లీ సల్మాన్ ఆ కుర్రాడిని కలిచి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.ప్రస్తుతం జగన్ బీర్ స్కూలుకు వెళ్తున్నట్లు తల్లి తెలిపింది .