బాలీవుడ్ లో విషాదం! ప్రముఖ హీరోయిన్ మృతి!

ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో మరణాల సంఖ్య ఎక్కువైపోతున్నయి.నిన్న బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్ కుమార్ బార్జాత్యా మరణ వార్త నుంచి ఇంకా సినిమా ఇండస్ట్రీ బయట పడకముందే మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ వర్ధమాన నటి సంఘమిత్ర చటర్జీ మృతి చెందినట్లు తెలుస్తుంది.27 వయసు వున్నా సంఘమిత్ర పెళ్లి తర్వాత విడాకులు తీసుకొని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా సక్సెస్ అయ్యే ప్రయత్నంలో వుంది.

ఆమె బాలీవుడ్ లో నటించిన దామిని సినిమాతో ప్రేక్షకులకి దగ్గరైంది.దాంతో పాటు మరో మూడు సినిమాలలో ఆమె నటించినట్లు తెలుస్తుంది.

ఇదిలా వుంటే కొంత కాలం క్రితం బ్రెయిన్ క్యాన్సర్ కి గురైన సంఘమిత్ర తరువాత సినిమాలు తగ్గించేసి ట్రీట్మెంట్ తీసుకుంటుంది.అయితే ఊహించని విధంగా ఆమెకి క్యారబెల్ సోకడంతో చనిపోయినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని దర్శకుడు రింగ్ నో బెనర్జీ సోషల్ మీడియా ద్వారా నిర్ధారించాడు.ఎంతో భవిష్యత్తు వుంటుంది అనుకున్న నటి ఇలా క్యాన్సర్ బారిన పడిన మరించడం ఇప్పుడు బాలీవుడ్ లో విషాదంగా మారింది.

Advertisement

ఆమె మరణ వార్త తెలిసిన సహా నటీనటులు ఆమె మృతికి నివాళి అర్పించారు.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో చాలా మంది నటులు క్యాన్సర్ బారిన పడి మృత్యు ముఖం నుంచి బయట పడ్డారు.

అయితే సంఘమిత్ర మాత్రం ముత్యువుని జయించలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు