భారత్ లో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది.ఈ మేరకు ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
ప్యాసెంజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే కేంద్రాన్ని భారత్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఇండియాతో పాటు అంతర్జాతీయంగా ఉన్నఅవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుందని సమాచారం.
అయితే ఇప్పటికే భారత్ లో 24 మిలియన్ డాలర్ల పెట్టుబడితో బోయింగ్ సంస్థ విమాన విడి భాగాలకు సంబంధించి లాజిస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.