కేంద్ర అధికార పార్టీ బిజెపి ఏపీ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తోంది.చాలా కాలంగా ఏపీలో బిజెపిని బలోపేతం చేయాలని చూస్తున్నా, అది సాధ్యపడటం లేదు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయినా ఏపీలో మాత్రం అందుకు తగ్గ అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పొత్తులపైనే బిజెపి ఆధారపడాల్సి వస్తుంది.ప్రస్తుతం జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకున్నా.
అది పైకి మాత్రమే అన్నట్లుగా ఉంది.రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు ఇప్పటివరకు చేపట్టలేదు.
ఏ విషయంలోనూ ఏకాభిప్రాయంతో లేవు.

ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన విషయంలో అంత సానుకూలంగా లేకపోవడం వంటివి ఈ రెండు పార్టీల మధ్య మరింత దూరం పెంచుతూ వస్తున్నాయి.ఇక జనసేన, టిడిపిలో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉండడంతో బిజెపి దాన్ని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అయినా బీజేపీని కాదని పవన్ టిడిపి వైపు మొగ్గు చూపిస్తున్నారు.
అంతేకాదు బిజెపిని కూడా తమతో కలవమని అటు పవన్ ఇటు చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు.అయినా బిజెపి అగ్ర నేతలు టిడిపిని కలుపుకుని వెళ్లేందుకు సముఖంగా లేకపోవడంతోనే ఈ ప్రతిస్థంభన ఏర్పడింది.
ఇది ఇలా ఉంటే , జనసేన , టిడిపిలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం ఖాయం అయిన నేపథ్యంలో ఈరోజు, రేపు భీమవరంలో జరగబోయే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ పొత్తుల అంశంపై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుని వెల్లడించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

టిడిపి జనసేన తో పెట్టుకోవాలని బిజెపిలోని ఒక వర్గం అధిష్టానం పై ఒత్తిడి చేస్తుండగా, మరో వర్గం మాత్రం దీనికి అంగీకరించడం లేదట. దీంతో ఈరోజు, రేపు భీమవరంలో జరగబోయే కార్యవర్గ సమావేశాలకు ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో వారి సమక్షంలో ఈ పొత్తుల అంశంపై ఒక క్లారిటీ కి వచ్చి అధిష్టానం పెద్దల దృష్టికి ఆ విషయం తీసుకువెళ్లి ఏపీలో పొత్తులపై ప్రకటన చేసేందుకు ఏపీ బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారట.







