తాండూరులో బీజేపీ ( BJP )నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా బండి సంజయ్( Bandi Sanjay Kumar ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్( BRS PARTY ) తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్( KCR ) ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని నిలదీశారు.
అలాగే కాంగ్రెస్ హామీలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతానని తెలిపారు.







