తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది.రానున్న ఎన్నికలకు బీజేపీ నేతలు ప్రీ ప్లానింగ్ సిద్ధమవుతున్నారు.
అధికారం కోసం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర చేపట్టారు.ప్రజల సమస్యలు తెలుసుకుంటు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు.
అయితే బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది.ప్రజలు ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు.
ఊరు, వాడ, పల్లె, పట్టణ అనే తేడా లేకుండా ప్రజలు బండిసంజయ్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.తమ గ్రామాలకు వెళ్తున్న బండి సంజయ్‌ను భారీ గజ మాలలతో ఆహ్వానిస్తున్నారు.
ఆపాయ్యంగా పలకరిస్తూ గ్రామాల్లోని సమస్యలు చెబుతున్నారు.సమస్యలపై ప్రజలకు బండి సంజయ్ భరోసా ఇస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెబుతూ బండి సంజయ్ తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.ఇక బండి సంజయ్ యాత్రలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ నేతలు పాల్గొంటున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ లాంటి నాయకురాలు పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.ప్రభుత్వంపై విమర్శల బాణం ఎక్కు పెడుతూ బండిసంజయ్ పాదయాత్రలో భాగస్వాములు అవుతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో.బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈనెల 5న మహబూబ్ నగర్‌కు రానున్నారు.స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే జనం గోస- బీజేపీ భరోసా పేరుతో చేపట్టనున్న సభలో ఆయన పాల్గొననున్నారు.
బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 5న 22 రోజులకు చేరుకుంటుంది.దీంతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు.ఇందుకోసం భారీ జన సమీకరణ చేస్తున్నారు.
బహిరంగ సభ నిర్వహణపై బండి సంజయ్ అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశం జరిగింది./br>

ఈ సమావేశంలో.ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ నేతలతో చర్చించారు.బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర తీరు తెన్నులు, ప్రజల స్పందనపైనా చర్చించారు.పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారన్నారు.
ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు.అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట బహిరంగ సభల్లానే.మహబూబ్‌నగర్ సభను సక్సెస్ చేస్తామన్నారు.పాలమూరు గడ్డా.
బీజేపీ అడ్డా అన్నారు బండి సంజయ్.రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఉమ్మడి జిల్లా ప్రజలు సక్సెస్ చేస్తున్నారన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఏర్పడిందన్నారు.5న జరిగే బహిరంగ సభను సక్సెస్ చేసి సత్తా చాటాలన్నారు బండి సంజయ్.







