బీజేపీ జాతీయ నాయకత్వం కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందా?.అసలు క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు రంగంలో దిగిందా ? అంటే అవుననే తెలుస్తోంది.తెలంగాణలో ఇప్పటికే చాపకింద నీరులా బీజేపీ దూసుకుపోతోంది.దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో అక్కడ భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్న నిర్ణయానికి బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చేసింది.
ఇప్పుడు ఆ పార్టీకి ఏపీయే కొరకరాని కొయ్యగా ఉంది.ఇక్కడ పట్టుకోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.నాయకులు వస్తున్నారే తప్పా కేడర్ ఉండడం లేదు.
ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉంది.
తాజాగా చిరంజీవి కూడా ఈ కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై బీజేపీ సర్వే చేసినట్టు తెలుస్తోంది.
ఈ సర్వే టీంలు భారీగా రంగంలోకి దిగాయి.తాజా సర్వేలో ఏపీలో బీజేపీకి ఎంత మాత్రం సానుకూల ఫలితాలు లేవని.
వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఇక్కడ ఎవ్వరూ నమ్మరని తేలిందట.ఇక్కడ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నా.
ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నా బీజేపీ విషయంలో మాత్రం ఏపీ జనాలు తీవ్ర వ్యతిరేకతతోనే ఉన్నారంటున్నారు.

ఇక రాజధాని అమరావతి విషయంలో కూడా ద్వంద వైఖరి అనుసరిస్తోంది.తొలుత రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది పార్టీ నిర్ణయం అంది.తర్వాత స్టాండ్ మార్చేసింది.
ఈ ఒక్కటే కాదు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్, భారీ ఓడరేవు వంటి విభజన చట్టం హామీలను కూడా తుంగలో తొక్కారు.
ఇక రైతు చట్టాలపై బీజేపీపై దేశ వ్యాప్తంగానే కాకుండా ఏపీలో కూడా తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది.
ఇక పెట్రోల్ ధరల పెంపు కూడా బీజేపీపై సాధారణ, మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది.ఈ పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ ఎప్పటకీ పుంజుకోదని తాజా సర్వేలో తేలడంతో ఆ పార్టీ అధిష్టానం మైండ్ బ్లాక్ అయ్యిందని టాక్ ?
.