షిండే కు చెక్.. అందుకే అజిత్ పవార్ ఎంట్రీ ?

మహారాష్ట్రలో రాజకీయాలు( Maharashtra Politics ) ఎప్పుడు ఎలా మారిపోతాయో అంచనా వేయడం కష్టంగా మారింది.ఆరాష్ట్రంలోని ప్రధాన పార్టీలలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం ఈ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

 Bjp Planning To Appoint Ajith Pawar As Maharashtra Cm Deails, Bjp , Ajith Pawar-TeluguStop.com

ఆ మద్య శివసేన చీలికతో వార్తల్లో నిలవగా ఇప్పుడు ఎన్సీపీ( NCP ) అదే చీలికతో వార్తల్లో నిలుస్తోంది.గతంలో ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్( Ajith Pawar ) 30 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి శివసేన షిండే వర్గంలో చేరారు.

షిండే వర్గంలో చేరగానే ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టి అందరిని ఆశ్చర్య పరిచారు.ఇప్పుడు ఏకంగా షిండే సి‌ఎం సీటుకె ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.

త్వరలోనే షిండే స్థానంలో మహారాష్ట్ర సి‌ఎం గా అజిత్ పవార్ పదవి చేపడతారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Ajith Pawar, Eknath Shinde, Maharashtra Cm, Maharashtra, Sharad Pawar, Sh

ఈ వార్తలను అజిత్ పవార్ వర్గంలోని కొంత మంది నేతలు కూడా సమర్థిస్తుండడంతో మళ్ళీ మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.గతంలో ఉద్దవ్ థాక్రే( Uddhav Thackeray ) సి‌ఎం గా ఉన్న టైమ్ లో షిండే( Eknath Shinde ) ద్వారా చీలిక తెచ్చి థాక్రే వర్గాన్ని కూల్చేసింది బీజేపీ.ఆ తరువాత బీజేపీ మరియు శివసేన షిండే వర్గం కలిసి.

ఏక్ నాథ్ షిండేను సి‌ఎం చేశాయి.కాగా వచ్చే ఎన్నికల్లో సొంత పట్టుకోసం చూస్తున్న బీజేపీ షిండేను కూడా పక్కన పెట్టె ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే ఎన్సీపీలో చీలిక తెచ్చి అజిత్ పవార్ షిండే వర్గంలో చేరడం వెనుక బీజేపీ వ్యూహమే అనేది బహిరంగ రహస్యం.

Telugu Ajith Pawar, Eknath Shinde, Maharashtra Cm, Maharashtra, Sharad Pawar, Sh

ఇప్పుడు షిండేను గద్దె దించి ఆ స్థానంలో అజిత్ కు సి‌ఎం బాద్యతలు అప్పగించి ఆదిపత్యం చెలాయించే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోందట.ఎందుకంటే షిండే కంటే కూడా అజిత్ పవార్ రాజకీయ చతురతలో కొంత ముందుంటారు.అందుకే షిండే వర్గంలోకి అజిత్ పవార్ ఎంట్రీ ఇచ్చే విధంగా బీజేపీ ప్రణాళిక రచించి సక్సస్ అయింది.

అయితే ఒకవేళ అజిత్ పవార్ కు సి‌ఎం పదవి అప్పగిస్తే.షిండే వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు.మొత్తానికి ఉద్దవ్ థాక్రేకు వెన్నుపోటు పొడిచి సి‌ఎం పదవి అధిష్టించిన ఏక్ నాథ్ షిండే కు అదే వెన్నుపోటు మంత్రంతో అజిత్ పవార్ ను బరిలోకి దింపుతోంది బీజేపీ.మరి రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube