4 ఏళ్ల వైకాపా పాలనపై భాజపా వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి - విష్ణువర్ధన్ రెడ్డి

4 ఏళ్ల వైకాపా పాలనపై భాజపా వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్‌.

 Bjp Leader S Vishnuvardhan Reddy Demands Ycp To Answer These 9 Questions, Bjp Le-TeluguStop.com

విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్‌.భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరిగారు అడిగిన ప్రళ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైకాపా నేతలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు.

ఈ ప్రశ్నలపై తితిదే ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పినా 48 గంటలైనా ఆ పనిచేయలేకపోయారు.

సమాధానం లేదని పారిపోయారా? 4 ఏళ్ల వైకాపా పాలనపై భాజపా 9 ప్రశ్నలను వేస్తుంది.వాటికి సమాధానం చెప్పాలి.

1).బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్‌ 3 వ స్ధానంలో ఉంది.ఈ వైఫల్యానికి మీ సమాధానం ఏంటి?

2).తలసరి ఆదాయంలో దక్షిణాధిరాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు వెనుకబడిరది.

వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదు ?

3).జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సహయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారు?

4).కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమిషన్‌ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు.ఇళ్లు నిర్మిస్తే కమిషన్‌ కాదు కాబట్టి ఆ పనిచేయలేదా?

5).రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్‌ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు ? వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?

6).ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?

7).ఉన్నత విద్యను ఎందుకు నిర్ల్యక్షం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకారవేతనాలు దూరం చేశారు.డిగ్రీలో తెలుగును రద్దుచేశారు.ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

8).ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? వర్శిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో లెక్చరర్లను, పాఠశాలల్లో టీచర్లను ఎందుకు భర్తీచేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?

9).రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఉందుకు పునర్నిర్మించలేదు? వైకాపా మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుంది.` తిరుపతిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహంపై, గుంటూరులో అమరావతి రైతులకు చేసిన అన్యాయంపై, పంచాయతీ నిధుల మళ్లింపుపై, రైతులకు రాయితీలు ఇవ్వకపోవడంపై, రాజమండ్రిలో అక్వా ఉత్పత్తుతులకు సహకారం ఇవ్వకపోవడం, విశాఖలో భూకబ్జాలు, దిగజారిన శాంతిభద్రతలు, పారిశ్రామిక అభివృద్ధిని పురందేశ్వరిగారు ప్రశ్నించారు.

అమెను విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో, ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలి?
విజయసాయి రెడ్డి విశాఖ అభివృద్ధికి ఏంచేశారు?
రోజా పర్యాటక శాఖ అభివృద్ధికి ఏం చేశారు?
గుడివాడ అమర్నాధ్‌ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు? కోళ్ల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అమర్నాధ్‌ కోళ్ల పరిశ్రమ పెట్టుకోవాలి.
బోత్స సత్యనారాయణ ఎంత మంది పీజీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చారు? 4 ఏళ్లలో డిఎస్‌సి ద్వారా ఎందుకు భర్తీ చేయలేదు?
హౌొసింగ్‌లో 1000 కోట్ల నిధులు దుర్వినియోగంపై ఏం సమాధానం చెబుతారు?
విడదల రజని వైద్యఆరోగ్య వ్యవస్థను ఎంతగా బలోపేతం చేశారో చెప్పాలి.
ఎయిమ్స్‌కు కనీసం నీటిని అందించలేకపోయారు.
ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఏటా ఇచ్చే రూ.400 కోట్ల నిధులతో ఒక్కో మనిషికి రూ.5 లక్షల విలువైన వద్య సదుపాయం లభిస్తుంటే ఎందుకు దాని గురించి మాట్లాడరు?
వైద్యకేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, ఆర్‌బీహెచ్‌లు, రహదారులు, పర్యాటక కేంద్రాలకు కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు.
ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.9 మంది లేదా 90 మందిని లేదా కట్టుకుని రండి.ఎక్కడి వస్తారో చెప్పండి.ఎప్పుడైనా చర్చకు సిద్దంగా ఉన్నాం.
సమాధానం చెప్పకుంటే ప్రజాక్షత్రంలో తేల్చుకుంటాం.దిగుజారుడు వ్యాఖ్యలు మానేయాలి.మీ భాషను ప్రజలు ఛీ కొడుతున్నారు.
2024 లో భాజాపా బలమైన రాజకీయ శక్తిగా వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube