ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections )జరగనున్న సంగతి తెలిసిందే.జమిలి ఎన్నికలపై గత కొన్నాళ్లుగా చర్చ నడవడంతో ఈ ఐదు రాష్ట్రల ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని కేంద్ర ప్రభుత్వం హింట్ ఇవ్వడంతో తెలంగాణ, మద్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్( Telangana, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan ) వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లైంది.అయితే ఇన్నాళ్ళు సౌత్ ఎన్నికల విషయంలో భయంగా ఉన్న బీజేపీ ఇప్పుడు నార్త్ విషయంలో కూడా భయపడుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
మద్య ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో బీజేపీకి ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి.ఇక తెలంగాణలో అయితే పార్టీ పరిస్థితి ఆగమ్య ఘోచారంగా ఉంది.ఎన్నికలు దగ్గర పడుతున్న ఇంకా సరైన అభ్యర్థుల ఎంపిక జరగడం లేదు.దాంతో ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ( BJP )ఓటమి తప్పదా అనే అనుమానాలు ఆ పార్టీ నేతలనే వేధిస్తోందట.
ఈ నేపథ్యంలో ఓటమి నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలకు కాషాయ పెద్దలు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది.మద్య ప్రదేశ్ లో ఇటీవల తొలి జాబితా అభ్యర్థులను విడుదల చేసింది కాషాయ పార్టీ.
ఆ జాబితాలో సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( CM Shivraj Singh Chouhan )కు టికెట్ కేటాయించలేదు.ఒక ముఖ్యమంత్రి గెలుపు విషయంలోనే కాషాయ పార్టీ పెద్దలకు నమ్మకం లేకపోవడాన్ని బట్టి ఆ రాష్ట్రంలో పార్టీ ఓటమిని కాషాయ పెద్దలు అంగీకరించినట్లే అనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.ఇక బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో రాష్ట్ర నేతలను కాకుండా కేంద్ర మంత్రులను, ఎంపిలను సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట కమలనాథులు.మద్య ప్రదేశ్ లో ఇప్పటికే ఆరుగురు కేంద్ర మంత్రులకు, ఏడుగురు ఎంపీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించారు.
ఇక తెలంగాణలో కూడా కేంద్రానికి సమబంచించిన వారికే ఎక్కువ సీట్లు కేటాయించాలని బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి ఓటమి భయంతో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఆ పార్టీ నేతలకే అర్థంకావడం లేదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.