టీడీపీతో మళ్లీ పొత్తుపెట్టుకునే ఆలోచనలో బీజేపీ ఉందా అంటే ఉంది అన్నట్లుగానే సంకేతాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తప్పించి, ఆస్థానంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కానీ, మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు కానీ ఏపీ బిజెపి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం పెద్దలు డిసైడ్ అయ్యారు.
అయితే ఇంత అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం వెనుక చాలా కథే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కక పోవడం , జనసేన ను కలుపుకు వెళ్ళే విషయంలో సోము వీర్రాజు ఆసక్తి చూపించకపోవడం, గతంతో పోలిస్తే బీజేపీ గ్రాఫ్ పెద్దగా పెరగకపోవడం , ఇవన్నీ వీర్రాజు వైఫల్యాలు గానే బీజేపీ అధిష్టానం చూస్తోంది.
అది కాకుండా ఏపీ లో పెద్ద ఎత్తున మత మార్పిడిలు జరుగుతున్నా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హోదాలో వీర్రాజు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడాన్ని కూడా బిజెపి అగ్రనాయకులు ఆగ్రహంగా ఉండడానికి కారణంగా తెలుస్తోంది.మరో వారం రోజుల్లోనే వీర్రాజు ను తప్పించి వేరొకరికి ఆ బాధ్యతను అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఎపి బిజెపి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఆయన అయితేనే వైసీపీని విమర్శించడం లో గాని, బీజేపీ గ్రాఫ్ పెరిగేలా చేయడంలో కానీ సక్సెస్ అవుతారు అనేది బిజెపి పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది.అదీ కాకుండా ఏపీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై ఆర్ఎస్ఎస్ కూడా ఆగ్రహంగా ఉందని , ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కు చెందిన పత్రిక లో జగన్ కు వ్యతిరేకంగా కథనాలు రావడం, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు మద్దతుగా, చంద్రబాబుకు అనుకూలంగా ఆ పత్రికలో కథనాలు రావడంతో పైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మతమార్పిడులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని సంఘ్ పరివార్ ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉంది.

దీనిపై బిజెపి ఆగ్రహంగా నే ఉన్నా, జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పెద్దగా పట్టించుకోనట్లు గా వ్యవహరించారు.అయితే బీజేపీ వైసీపీ మధ్య ఇప్పుడు వైరం ముదరడం తో ఈ పరిస్థితి ఏర్పడినట్లు గా కనిపిస్తోంది.అలాగే ఆర్ఎస్ఎస్ నేతల్లోనూ టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిపై సానుకూలత ఉండడంతో, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునేలా ఒప్పించే ప్రయత్నాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు అయితే రెండు పార్టీల మధ్య దోస్తీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవనే కారణంతోనూ వీర్రాజు ను తప్పించబోతున్నట్లు సమాచారం.