తెలంగాణ బిజెపి నేతలకు తలంటిన ఢిల్లీ పెద్దలు ? ఇప్పటికైనా కలిసి నడుస్తారా?

BJP High Command Startred Damage Control In Telangana Bjp Details, BJP High Command , Telangana Bjp, Bandi Sanjay, Dharmapuri Aravind, Etela Rajender, Shiva Prakash, Bjp Group Politics, Tharun Chugg, Sunil Bansal

తెలంగాణలో అధికారానికి చాలా దగ్గరగా ఉన్నామని భావిస్తున్న బిజెపి ( BJP ) అధిష్టానం నికి రాష్ట్ర బిజెపి నాయకుల వర్గ పోరు పెద్ద తలపోటుగా మారిపోయింది… ముఖ్యంగా బండి సంజయ్( Bandi Sanjay ) వర్గానికి దర్మపురి అరవింద్( Dharmapuri Aravind ) వర్గానికి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గున మండే వాతావరణం ఏర్పడింది.కవిత వ్యవహారంలో మీడియా సాక్షిగా సంజయ్ వ్యాఖ్యలను ఖండించినప్పుడే వీరి మధ్య సఖ్యత లేదన్న వ్యవహారం బయటపడింది…

 Bjp High Command Startred Damage Control In Telangana Bjp Details, Bjp High Comm-TeluguStop.com

మరొక పక్క చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కూడా పార్టీలో తన మాటను కొంతమంది నేతలు లెక్కచేయడం లేదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తునారని అంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఇలాగే కొనసాగితే నాకు ఈ పదవి కూడా అవసరం లేదని ఈ పదవి నుంచి తీసేయమంటూ ఆయన కేంద్ర పెద్దల వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం.ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్కపొరును సరి చేయకుంటే త్వరలో వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు నడుం కట్టింది.

కొంత మంది ముక్య నేతలను రాష్ట్రానికి పంపింది .

Telugu Bandi Sanjay, Bjp, Bjp Command, Etela Rajender, Shiva Prakash, Sunil Bans

బిజెపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిజెపి ముఖ్యనేతలైన బండి సంజయ్ ,డీకే అరుణ ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ లతో ఢిల్లీ పెద్దలు శివ ప్రకాష్, తరుణ్ చుగ్ , సునీల్ బన్సాల్ సంప్రదింపులు జరిపారు.రాష్ట్ర నేతల సమస్యలను ఆసాంతం విన్న పెద్దలు అందుకు కొన్ని పరిష్కార మార్గాలు కూడా సూచించినట్టు సమాచారం .అంతే కాకుండా విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వారికి నేతలు అర్థమయ్యేలా చెప్పారని ఇప్పటికైనా సమిష్టిగా పనిచేయకుంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారని కూడా సమాచారం.

Telugu Bandi Sanjay, Bjp, Bjp Command, Etela Rajender, Shiva Prakash, Sunil Bans

మీటింగ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ ….కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తులతో ముందుకు వెళ్తున్నాయని.ప్రజాభిమానం ఉన్న మాకు పొత్తుల అవసరం లేదని మేము సింగల్ గానే ఎన్నికలకు వెళ్తామని.అధికారంలోకి వస్తామని సర్వేలన్నీ కూడా మాకే అనుకూలంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు ఢిల్లీ పెద్దలు క్లాస్ రాష్ట్ర నేతలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో మరి కొద్ది రోజులకే తెలుస్తుంది….

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube