ఏపీ లో బిజెపికి ( BJP ) పూర్వ వైభవం తీసుకు రావడం కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఒక వైపు తెలంగాణ లో అధికారం కోసం బలంగా ప్రయత్నిస్తున్న బిజెపి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కనీసం ఒక్క స్థానం అయినా గెలుచుకోగలదా అనే అనుమానం తో ఉంది.
ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం లో పార్టీ కొత్త అధ్యక్షుడిని తెర పైకి తీసుకు రావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.సోము వీర్రాజు( Somu Veeraju ) ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఆయన కాకుండా మరెవ్వరు పార్టీని ముందుకు నడిపించగలరు అంటూ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులతో ఇటీవల ఏపీ అధ్యక్షుడి గురించి చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) ఇటీవల బిజెపిలో జాయిన్ అయ్యారు.ఆయనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందా అంటూ అధినాయకత్వం పరిశీలించినట్లుగా సమాచారం అందుతుంది.నిన్నకాక మొన్న పార్టీలో జాయిన్ అయిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ యొక్క అధ్యక్ష పదవి ఇస్తే సీనియర్ నాయకులు మరియు ఎప్పటి నుండో పార్టీలో కొనసాగుతున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి నడుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తానికి బిజెపికి ఏపీలో కొత్త రూపు తీసుకొచ్చేందుకు పార్టీ అధినాయకత్వం చేయిస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయో చూడాలి.ఏపీలో అధ్యక్షుడిని మార్చినంత మాత్రాన అధికారంలోకి వచ్చేంతగా అద్భుతాలు బిజెపిలో జరుగుతాయా అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు చర్చ జరుగుతుంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యం లో రాబోయే ఒకటి రెండు నెలల్లోనే అధ్యక్ష మార్పు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







