వైసీపీ మంత్రి ఉష శ్రీ చరణ్ ( Usha Sri Charan )కు చేదు అనుభవం ఎదురయింది.విషయంలోకి వెళ్తే శనివారం శ్రీ సత్య సాయి జిల్లా ( Sri Sathya Sai Distt )పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమెకు నిరసన సెగ తగిలింది.కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను కొద్ది రోజుల క్రితం పెనుగొండ సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గంలో శనివారం మంత్రి ఉషశ్రీ చరణ్ గ్రామ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన అశ్వద్ధామ అనే మహిళ నాయకురాలి ఇంటికి వెళ్లగా స్థానిక సర్పంచి, గ్రామ నాయకులు అడ్డుకున్నారు.
మంత్రి ఉష శ్రీ చరణ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మంత్రి ఫ్లెక్సీలను కూడా చించేయడం జరిగింది.దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.పరిస్థితి శృతిమించే విధంగా మారడంతో మంత్రి ఉషశ్రీ చరణ్ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.2024 సార్వత్రిక ఎన్నికలను వైసీపీ అధినేత జగన్( jagan ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగా ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేస్తూ ఇప్పటికే 60 కి పైగా స్థానాలలో ఇన్చార్జిలను మార్చడం జరిగింది.కొంతమందికి స్థానా చలనం కూడా కల్పించారు.
ఆ రకంగానే మంత్రి ఉషశ్రీ చరణ్ కి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ సమన్వయకర్తగా నియమించడం జరిగింది.