రైలు ప్రయాణికుడికి చేదు అనుభవం.. ఆర్డర్ చేసిన గులాబ్ జామూన్‌లలో పురుగులు..

చెన్నైలోని( Chennai ) ఒక ప్రముఖ స్వీట్ షాప్ పురుగులు పట్టిన ఫుడ్స్‌ అమ్ముతూ ప్రజల ఆగ్రహానికి గురవుతోంది.ఈ షాప్ నుంచి కొనుగోలు చేసిన గులాబ్ జామూన్‌లలో( gulab jamuns ) బతికి ఉన్న తెల్లటి పురుగు పాకుతున్నట్లు ఒక ప్యాసింజర్ వీడియోతో సహా వెల్లడించాడు.

 Bitter Experience For Train Passenger Worms In Gulab Jamuns Ordered, Worms, Gula-TeluguStop.com

దక్షిణ భారతదేశంలోని పాపులర్ రెస్టారెంట్లు, స్వీట్స్ ఔట్‌లెట్ల చైయిన్ అయిన అడయార్ ఆనంద భవన్ ( Adyar Ananda Bhavan )నుంచి స్వీట్ కొనుగోలు చేసినట్లు సదరు కస్టమర్ వెల్లడించాడు.అశోక్ నగర్ మెట్రో స్టేషన్ బ్రాంచ్‌లో ఉన్న షాప్ నుంచి స్వీట్ కొనుగోలు చేసినట్లు కస్టమర్ వెల్లడించాడు.

ఇలాంటి అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్నందుకు షాపుపై అసంతృప్తి, అసహ్యం వ్యక్తం చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, 42 లక్షలకు పైగా వ్యూస్, వేల కామెంట్‌లు వచ్చాయి.

చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోపై షాక్, ఆగ్రహంతో స్పందించారు. ఇది పూర్తిగా స్వీట్ షాప్ నిర్లక్ష్యమేనని, క్వాలిటీ కంట్రోల్ లోపించిందని విమర్శించారు.కొంతమంది యూజర్లు షాప్‌పై తమకున్న గౌరవం, నమ్మకాన్ని కోల్పోయామని, ఇకపై దాని నుంచి కొనుగోలు చేయబోమని చెప్పారు.మరికొందరు వీడియో చూశాక స్వీట్లు తినకూడదనే కొత్త భయం మొదలైందని అంటున్నారు.

భారత్‌లో ఇలాంటి పాడైపోయిన ఆహారపదార్థాలు కస్టమర్లకు షాక్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.2018లో, రైలులో మురికి టాయిలెట్ వాటర్‌ను టీ, కాఫీ కంటైనర్లలో ఒక వ్యక్తి నింపుతున్న వీడియో వైరల్ కావడంతో భారతీయ రైల్వే వెండింగ్ కాంట్రాక్టర్‌కు రూ.1 లక్ష జరిమానా విధించింది.మరొక సందర్భంలో, ఛప్రా సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వెజ్ థాలీలో పురుగును కనుగొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube