పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ అనంతరం సినిమా అవకాశాలను అందుకుని రౌడీ హీరోగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.
ఇలా ఒక వైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు.అలాగే వస్త్ర వ్యాపారం చేస్తూ బిజినెస్ లో కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే తాజాగా నేడు విజయ్ దేవరకొండ 33 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే రౌడీ హీరో పుట్టినరోజు కావడంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను విడుదల చేస్తున్నారు.అలాగే అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపడానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఆయన సీడీపీ కామన్ డిస్‌ప్లే పిక్చర్ ను నేడు రాత్రి 8 గంటలకు లాంచ్ చేయనున్నారు.ఈ క్రమంలోనే హీరోయిన్ ఛార్మి, ప్రగ్యాజైశ్వాల్, సమంత, నభా నటేష్ నలుగురు హీరోయిన్లతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సీడీపీను లాంచ్ చేయబోతున్నారు.మొత్తానికి విజయ్ దేవరకొండ పుట్టినరోజు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు.







