ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఏ హీరోయిన్ అయినా వరుసగా విజయాలు సాధిస్తే గోల్డెన్ లెగ్ అని అలా కాకుండా భిన్నంగా జరిగితే ఐరన్ లెగ్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కామెంట్ల గురించి హీరోయిన్లు డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా కొంతమంది బాధ పడుతున్నారు.
నటి బిందుమాధవి( Bindu Madhavi ) తాజాగా ఒక సందర్భంలో హీరోయిన్ల గురించి అలా కామెంట్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూసెన్స్ వెబ్ సిరీస్( Newsense Web Series ) ప్రమోషన్స్ లో భాగంగా బిందు మాధవి మాట్లాడుతూ హీరోయిన్ల గురించి ఐరన్ లెగ్ అని కామెంట్లు చేయడం నా దృష్టిలో తప్పు అని ఆమె చెప్పుకొచ్చారు.అలా ఎవ్వరికీ ఇవ్వకూడదని ఆమె కామెంట్ చేశారు.గతంలో ఎవరైనా బిందు మాధవి గురించి ఐరన్ లెగ్ అని కామెంట్ చేసి ఉంటారని అందుకే ఆమె ఈ విధంగా స్పందించి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పీపుల్స్ మీడియా బ్యానర్ ( Peoples Media Factory ) లో నటించే ఛాన్స్ రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.నీల అనే న్యూస్ రిపోర్టర్ ( News Reporter ) పాత్రలో నేను నటించానని ఈ రోల్ నాకు చాలా స్పెషల్ అని ఆమె పేర్కొన్నారు.
ఈ సినిమా షూటింగ్ కొరకు మదనపల్లిలో చాలా రోజులు ఉన్నానని సొంతూరు అయిన మదనపల్లిలో ఉండటం సంతోషాన్ని కలిగించిందని బిందు మాధవి అభిప్రాయం వ్యక్తం చేశారు.
బింధు మాధవి కెరీర్ పరంగా బిజీ కావాలని ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బిందు మాధవి ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.బిందు మాధవి పారితోషికం సైతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
న్యూసెన్స్ వెబ్ సిరీస్ తర్వాత బిందు మాధవికి ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.