తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది.ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ఐదుగురు ఆరుగురు కంటెస్టెంట్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అనడం లో సందేహం లేదు.
గత సీజన్లో టాప్ 5 గా ఉన్న వారు కొందరు ఈ సీజన్లో ఉండటం తో వారికి మంచి ఆదరణ లభిస్తుంది.ముఖ్యం గా గత సీజన్లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఈ సీజన్లో మోస్ట్ వాంటెడ్ అండ్ ఖచ్చితంగా గెలుస్తాడు అనే నమ్మకంతో ఉన్నాడు అనే విషయం తెలిసిందే.
అఖిల్ ఖచ్చితంగా విన్నర్ గా నిలుస్తాడు అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్న ఈ సమయంలో బిందు మాధవి కి వస్తున్న ఆదరణ అతని అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.ఇదే సమయం లో అఖిల్ హౌస్లో వ్యవహరిస్తున్న తీరు తో అతను కనీసం టాప్ 5 వరకు కూడా వెళ్లడేమో అంటూ చర్చ జరుగుతుంది.
బిందు మాధవితో ఈయన పదే పదే గొడవలు పడటం వల్ల వ్యవహారం సీరియస్ గా మారుతుంది.పెద్దఎత్తున అంచనాలు ఉన్న అఖిల్ పై తాజా ఎపిసోడ్స్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్స్ మరియు బిగ్‌బాస్ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేయడం జరిగింది.బిందు మాధవి మరియు అఖిల్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శివ మరియు నటరాజ్ మాస్టర్ లకు సపోర్ట్ చేస్తున్నారు.
ఆ సమయం లో వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయి కి చేరింది.నువ్వు ఫ్రెండ్స్ సాయంతో ఆడుతున్నావు అంటూ బిందు మాధవి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అఖిల్ చాలా సీరియస్ అయ్యాడు.

ఆ సమయం లో ఏకంగా అఖిల్ ఏం చేయాలో పాలు పోక కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.నేను ఫ్రెండ్స్ తో ఆడే వాడిని అయితే గత సీజన్లో రన్నరప్ గా నిలవ లేక పోయే వాడిని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అదే సమయంలో అజయ్ కూడా బిందు మాధవి పైకి వచ్చి అఖిల్ ని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కాస్త సీరియస్ అయ్యాడు.అప్పుడు బిందు మాధవి కూడా నీ ప్రాబ్లం ఏంటి అంటూ మీదికి వెళ్లడం మరింత హీట్ పెంచింది.
మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ హాట్ హాట్ గా జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.







