చనిపోయిన బింబిసార అలా బ్రతుకుతాడా.. సినిమాలో ఊహించని ట్విస్ట్ ఇదేనా?

కళ్యాణ్ రామ్ హీరో వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార సినిమా క్లైమాక్స్ లో బింబిసారకు బుల్లెట్లు తగలగా ఆ పాత్ర చనిపోయినట్లు పరోక్షంగా వెల్లడించారు.అయితే చనిపోయిన బింబిసార పార్ట్2 లో ఎలా బ్రతుకుతాడనే సందేహం చాలామందికి కలుగుతోంది.

 Bimbisara Movie Shocking Twists Details, Bimbisara Movie, Nandamuri Kalyan Ram,-TeluguStop.com

అయితే బింబిసార పార్ట్1 లో సంజీవనితో జుబేదా పాత్ర పోషించిన శ్రీనివాసరెడ్డిని బ్రతికేంచే ఒక సన్నివేశం ఉంది.ఆ సంజీవని రెండుసార్లు మాత్రమే చనిపోయిన వారిని బ్రతికిస్తుంది.

ఆ సంజీవని సహాయంతో బింబిసార మళ్లీ బ్రతుకుతారని తెలుస్తోంది.బింబిసార2 కథను కూడా రెండు కాలాలలో తెరకెక్కించాలని మల్లిడి వశిష్ట భావిస్తున్నారని బోగట్టా.బింబిసార2 సినిమాలో యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.బింబిసార పార్ట్1 ఫుల్ రన్ లో సాధించే కలెక్షన్లను బట్టి బింబిసార2 బడ్జెట్ డిసైడ్ కానుంది.

బింబిసార పార్ట్1 ను పరిమిత బడ్జెట్ తో వశిష్ట తెరకెక్కించారు.

ఖర్చుకు సంబంధించి కొన్ని విషయాలలో రాజీ పడ్డారని సినిమాను చూస్తే అర్థమవుతుంది.

Telugu Bimbisara, Bimbisara Story, Kalyan Ram, Nandamurikalyan, Samyukta Menon,

అయితే రెండో పార్ట్ కు సంబంధించి ఆ విమర్శలు రాకుండా కళ్యాణ్ రామ్ నిర్ణయాలు తీసుకోనున్నారని బోగట్టా.బింబిసార2 సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయనున్నారని తెలుస్తోంది.కేథరిన్, సంయుక్త మీనన్ పాత్రలు బింబిసార2 సినిమాలో కూడా కొనసాగనున్నాయి.బింబిసార2 సినిమాలో తన పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని సంయుక్త మీనన్ తాజాగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

Telugu Bimbisara, Bimbisara Story, Kalyan Ram, Nandamurikalyan, Samyukta Menon,

బింబిసర పార్ట్2 విజయం సాధిస్తే బింబిసార పార్ట్3 దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంది.ఫ్రాంఛైజీలా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.బాహుబలి2, కేజీఎఫ్2 సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో బింబిసార2 సినిమా దిశగా అడుగులు పడుతున్నాయి.బింబిసార2 సక్సెస్ సాధిస్తే రెండు భాగాలుగా తెరకెక్కే సినిమాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube