థియేటర్లోనే కాదు ఓటీటీలో పోటీ పడబోతున్న బింబిసారా, సీతారామం!

కరోనా తర్వాత ఒక్కో సినిమా థియేటర్లో విడుదలవుతూ ఎంతో మంచి విజయాన్ని అందుకొని థియేటర్లకు పూర్వ వైభవం తీసుకువస్తున్నాయి.ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగస్టు నెలలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతున్నాయి.

 Bimbisara And Seetharam Are Going To Compete Not Only In Theater But Also In Ott-TeluguStop.com

ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాలు ఐదవ తేదీ విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ కలెక్షన్లు రాబట్టాయి.ఈ విధంగా ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైనప్పటికీ రెండు సినిమాలు భారీ కలెక్షన్లను రాబట్టి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి.

ఇలా థియేటర్లో ఒకేసారి పోటీకి సై అన్న ఈ సినిమాలు థియేటర్ వద్ద మంచి హిట్ కొట్టాయి.ఈ క్రమంలోనే మరోసారి ఈ రెండు సినిమాలు డిజిటల్ మీడియాలో కూడా పోటీకి సిద్ధమయ్యాయి.

ఒక సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాని జీ 5 కొనుగోలు చేయగా దుల్కర్ సీతారామం సినిమాని అమెజాన్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.

Telugu Amazon, Bimbisara, Ott Platm, Seetharam, Tollywood, Zee-Movie

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న ఈ సంస్థలు ఈ సినిమాలను ఒకేసారి డిజిటల్ మీడియాలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు సినిమాలను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు.బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ మంచి విజయం అందుకున్న ఈ సినిమాలు డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతాయో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube