జనాలు థియేటర్ కి రాకపోవడానికి అదే కారణం.. వైరల్ అవుతున్న నరేష్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత నెలలో విడుదలైన సినిమాలు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు సినిమాలను థియేటర్లో చూడటానికి ఇష్టపడటం లేదని ప్రేక్షకులు సినిమాని ఓటీటీలలో చూడటానికి అలవాటు పడడం వల్లే సినిమాలకు రాలేకపోతున్నారంటూ అందుకే సినిమాలు ఇలాంటి టాక్ తెచ్చుకున్నాయని పలువురు భావించారు.కానీ ఆగస్టు నెలలో విడుదలైన సినిమాలు మంచి విజయం సాధించాయి.

 Thats The Reason Why People Are Not Coming To The Theatre Nareshs Comments Are-TeluguStop.com

అయితే ఒక సినిమాని థియేటర్లో చూస్తే వచ్చే అనుభూతిని పొందటానికి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాలు చూస్తారని, ప్రేక్షకులు థియేటర్ కి రావాలంటే సినిమాలో కంటెంట్ కంపల్సరీ ఉండాల్సిందేనని ఇప్పటికే ఎన్నో సినిమాలు రుజువు చేసుకున్నాయి.

కంటెంట్ లేకపోయినా పెద్ద ఎత్తున సినిమాలకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేమని కూడా కొన్ని సినిమాలు నిరూపించాయని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నటుడు నరేష్ సినిమా థియేటర్ల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేయలేదు కంటెంట్ ఉన్న సినిమాలను చూడటానికి తప్పకుండా థియేటర్లకు వస్తున్నారని తెలిపారు.

Telugu Theater, Naresh, Pepsi, Popcorn, Tickets-Movie

ఒకప్పుడు 100 రోజులు 200 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన రెండవ రోజే థియేటర్లు మొత్తం ఖాళీగా కనపడుతున్నాయని ఈయన తెలిపారు.ఇలా థియేటర్ కు జనాలు రాకపోవడానికి కారణం కంటెంట్ లేకపోవడం , సినిమా టికెట్ల రేటు తక్కువగా ఉన్నప్పటికీ థియేటర్లో లభించే పెప్సీ పాప్ కార్న్ ధరలు అధికంగా ఉండటం వల్ల ఒక సామాన్య వ్యక్తి తన కుటుంబంతో థియేటర్ కి వచ్చి సినిమా చూడలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అందుకే ప్రేక్షకులు థియేటర్ కి రాలేకపోతున్నారని తెలిపారు.థియేటర్ నిర్వాహకులు ఈ ధరలను కట్టడి చేసినప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube