దొంగతనం చేశాడని అనుమానం.. ఉమ్మి నాకించిన ఊరి పెద్దలు!

ఊర్లలో జరిగే పంచాయతీలు కొన్ని సార్లు విచిత్రమైన తీర్పులు ఇస్తుంటాయి.వాటికి తలా, తోక ఉండదు.

 Bihar Shocker Youth Forced To Lick Spit In Panchayat Details, Bihar, Lick Split,-TeluguStop.com

కానీ పంచాయతీ పెద్దలంతా కలిసి తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది ధోరణి.ఏదైనా తప్పు, నేరం జరిగినా… వాటికి ఎలాంటి ఆధారాలు చూడరు కొన్ని సార్లు.

కేవలం మాటపై ఆధారపడి తీర్పులో వాద ప్రతి వాదనలు జరుగుతుంటాయి.చివరికి వారికి ఏదీ న్యాయం అని అనిపిస్తే, లేగా ఇంకేదైనా ఒత్తిడి వల్లో మరో వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పు చెబుతారు.

బిహార్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది.ఆ పంచాయతీ ఇచ్చిన తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది బిహార్ బెగూసరాయ్ పరిధిలోని మోహన్ పుర్ గ్రామం. ఆ ఊర్లో 12 వేల రూపాయలు దొంగతనం జరిగింది.

యువకుడిపై గ్రామస్థులంతా అనుమానం వ్యక్తం చేశారు.ఆధారాలు సంగతి మర్చిపోవాల్సిందే.

పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు.ఆ తీర్పే ఇప్పుడు అందరి విమర్శలను ఎదుర్కొంటుంది.

ఆ తీర్పు ప్రకారం, దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానం ఎదుర్కొంటున్న ఆ యువకుడు కింద ఉమ్మి వేసి తర్వాత దానిని నాకాలి.తర్వాత గుంజీలు తీయాలి.పంచాయతీ పెద్దలంతా తీర్పు చెప్పడంతో.ఆ యువకుడు వేరే దారి లేక అదే పని చేశాడు.

ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఆ తర్వాత కూడా అతడిని పోలీసులకు అప్పగించకుండా… వదిలేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube