వంటలక్క దెబ్బ... డీలా పడ్డ బిగ్ బాస్ !

స్టార్ మా లో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారానికి ఒకరు ఎలిమినేటి అవుతూ టాస్క్ లు చేస్తూ కెప్టెన్సీ కోసం పోటీపడి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

 Karthika Deepam Serial Trp Rating Beats Bigg Boss4, Biggboss4, Trp Ratings, Kart-TeluguStop.com

ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ కోసం, వాళ్ళు చెసే ఎంటర్టైన్మెంట్ బట్టి షో ముందుకు సాగుతుంది.అయితే ప్రస్తుతం రేటింగ్ విషయానికి వస్తే వంటలక్క దెబ్బకి బిగ్ బాస్ రేటింగ్ డీలా పడిపోయింది.

బిగ్ బాస్ షో ప్రారంభంలో రేటింగ్ గత రికార్డులు బద్దలు కొట్టగా ఇప్పుడు దారుణంగా పడిపోయింది.ప్రతి రోజు వచ్చే వంటలక్క సీరియల్ కి వచ్చినంత రేటింగ్ కూడా రావడం లేదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు.

ప్రస్తుతం ఏదో నడవాలి అంటే నడవాలి అన్నట్లు షో నడుస్తుంది.కాగా ప్రతి వారం టీఆర్పీ రేటింగ్లు పరిశీలించగా ఈ వారం టాప్ 5 లో స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ కి ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి.

అయితే అందరూ ఈ రేటింగ్స్ బిగ్ బాస్ షో వల్ల వచ్చింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే.బిగ్ బాస్ ద్వారా రేటింగ్స్ ఎక్కువగా వస్తున్నాయని ప్రేక్షకులు అనుకోవడంలో తప్పులేదు.

కానీ రియాలిటీలో బిగ్ బాస్ షో కు ఆ రేంజ్ లో రేటింగ్స్ రావడం లేదు.ఈవారం వంటలక్క ‘కార్తీకదీపం’ సీరియల్ టీఆర్పీలో మొదటి స్థానంలో ఉండగా.2 వ స్థానంలో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నిలిచింది.తరువాత వదినమ్మ, దేవత, చెల్లెలి కాపురం సీరియల్స్ వరుసగా ఉండగా బిగ్ బాస్ షో మాత్రం రేటింగ్స్ లో ఎక్కడో ఉందని తేలింది.

అయితే బిగ్ బాస్ షో శని, ఆది వారాల్లో కాస్త ఎంటర్టైన్మెంట్ తో ఉండడం వల్ల ఆరోజు మాత్రం టీఆర్పీ వస్తుంది.అయితే ఈ విధంగా ఈ రేటింగ్స్ వల్ల రియల్ కంటే రీలే ముందుందని తెలిసిపోయింది.

ఇక మన సీరియల్స్ ను వీక్షించే ఆడపడుచులు బిగ్ బాస్ షో ని పక్కకు పడేశారని అర్థం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube