బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి వారం ముగిసే సరికి హౌజ్ లో చాలా మంది మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చాయి.ముఖ్యంగా హౌజ్ లో కొందరు అవసరమైన దానికి.
అనవసరమైన దానికి గొడవలు పడుతున్నారు.ఈ సీజన్ లో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్న శ్రీహాన్ ని తన లవర్ సిరితో ఎటాక్ చేసింది మరో కంటెస్టంట్ ఇనయా సుల్తానా.
తన వెనక ఎవరు లేరని.తనకు ఎలాంటి సపోర్ట్ లేకుండానే బిగ్ బాస్ కి వచ్చానని అన్నది.
అంతేకాదు శ్రీహాన్ తో నీకు బయట సిరి ఉంది అంటూ మాట్లాడింది.
అయితే శ్రీహాన్ వెంటనే రెస్పాండ్ అయ్యి హౌజ్ లో లేని వాళ్ల గురించి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఇనయ మాత్రం ఇంటెన్షనల్ గానే శ్రీ హాన్ సేఫ్ గేం ఆడుతున్నాడు.బయట సిరి తనకు సపోర్ట్ గా ఉందని కామెంట్ చేసింది. ఇనయా హౌజ్ లో జరిగిన విషయాల గురించి శ్రీహాన్ ని టార్గెట్ చేస్తే ఓకే కానీ అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనడం కరెక్ట్ కాదు.శ్రీహాన్ ఏదైనా ఇనాయాని ఇబ్బంది పెడితే అప్పుడు తన వాయిస్ రేజ్ చేస్తే బాగుండేది.
సిరి వల్లే శ్రీహాన్ ఇక్కడ ఉన్నాడని ఇనయ చెప్పడంతో శ్రీహాన్ కొద్దిగా ఫీల్ అయ్యాడు.







