వీజే సన్నీతో యాంకర్ రవి... ఖుష్ అవుతున్న అభిమానులు.. కారణం?

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బిగ్ బాస్ షో లో గొడవలు, అలకలు, అపార్ధాలు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి.బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడే కొన్ని బంధాలు బయటకు వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి.కొంతమంది మధ్య ఉన్న అనుబంధాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అపార్థాలు మనస్పర్థల కారణంగా విడిపోవచ్చు.

మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో, అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఎపుడు పరిస్థితి ఏవిధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.ఇక కొంత మంది బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత కలిసిమెలిసి ఉంటారు.

ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా సన్నీ గెలిచిన విషయం తెలిసిందే.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతవరకూ యాంకర్ రవి, సన్నీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉన్నాయి.

ఇద్దరూ ఎక్కువగా పోట్లాడుకునే వారు.వారిద్దరి లో ఒకరు ఎలిమినేట్ అయ్యే వరకు వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

యాంకర్ రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత సింగర్ శ్రీరామచంద్రకు సపోర్ట్ చేశారు.

సన్నీకి ఓటు వేయమని రిక్వెస్ట్ చేయలేదు.కానీ తాజాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సన్నీ ఏకంగా రవి ఇంటికి వెళ్లి అతన్ని పర్సనల్ గా కలిసాడు.క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా రవితో పాటు కనిపించాడు సన్నీ.

అనంతరం రవి కూతురుతో కలిసి ఆడుకున్నాడు.ఇక సన్నీని, యాంకర్ రవిని ఒకేసారి చూసేసరికి ఇరువురి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రవి, సన్నీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని తాజాగా యాంకర్ రవి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక ఇద్దరి అభిమానులు ఈ ఫోటోని చూసి ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

తాజా వార్తలు