జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈసారి ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో సొంత నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఇటీవలే నియోజకవర్గంలో మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుండి బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి( Tamanna Simhadri) పోటీకి రెడీ అయ్యారు.
భారత చైతన్య యువజన పార్టీ( Bharatha Chaitanya Yuvajana Party ) తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.2019 ఎన్నికలలో మంగళగిరిలో కూడా తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.ఇప్పుడు పిఠాపురంలో పోటికి దిగడం సంచలనంగా మారింది.
ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని మరోసారి ఓడించాలని వైసీపీ అధిష్టానం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది.దీంతో నియోజకవర్గంలో చాలామంది వైసీపీ పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగారు.
పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత( Vanga Geetha) పోటీ చేస్తున్నారు.ఏపీలో మరో 35 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈసారి బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీలో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.2014 ఎన్నికలలో ఈ రకంగానే కూటమిగా ఏర్పడి విజయం సాధించడం జరిగింది.ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా విజయం సాధించాలని భావిస్తున్నారు.