బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కంటెస్టెంట్ నటుడు శివాజీ(Shivaji) ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే ఇతర కంటెస్టెంట్ ల గురించి ఎన్నో విషయాలను వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడానికంటే ముందుగా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు.అందుకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆది పురుష్(Adipurush) సినిమా గురించి మాట్లాడారు.

తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు చివరిగా ఆది పురుష్ సినిమా చూశానని తెలిపారు.మహాభారతం లాంటి ఒక గొప్ప కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒక మంచి సంకల్పమని ఈయన తెలిపారు.అయితే డైరెక్టర్ కొన్ని తప్పులు చేయటం వల్ల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఈయన తెలిపారు.
ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) గెటప్ తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా శివాజీ తెలిపారు.

ఇకపోతే రాజమౌళి(Rajamouli) లేకపోతే ప్రభాస్ లేరనీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.దానికి మీరు ఏమని సమాధానం చెబుతారు అంటూ ఈయనకు ప్రశ్న ఎదురైంది.ప్రభాస్ గురించి అలాంటి మాటలు మాట్లాడే హక్కు మనకు లేదు.
ప్రభాస్ అంటే ప్రభాసే అతనికి ఎక్కడ తిరుగులేదు.ఇక ప్రభాస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనే ప్రశ్నలను నన్ను అడగద్దు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే వేణు స్వామిని(Venu Swamy) అడగండి అంటూ ఈయన చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నాకు వేణు స్వామి అంటే చాలా గౌరవం నమ్మకం ఉందని ఈయన తెలిపారు.
ఆయన చెప్పే కొన్ని జాతకాలు పక్కా నిజమవుతాయి అంటూ వేణు స్వామి గురించి కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







